దత్తాత్రేయతో సమవేశమైన జానారెడ్డి

Dattatreya - Jana Reddy
Dattatreya – Jana Reddy

హైదరాబాద్‌: బిజెపి నేత, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించబడిన బండారు దత్తాత్రేయను కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కలిశారు. హైదరాబాద్, రామ్ నగర్ లోని దత్తన్న నివాసానికి వెళ్లిన జానా, దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇదేమీ రాజకీయ భేటీ కాదని, గవర్నర్ గా నియమితులైనందుకు దత్తాత్రేయకు అభినందనలు తెలిపేందుకే జానారెడ్డి వచ్చారని ఆయన కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయేనని సమాచారం. కాగా, ఎల్లుండి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న దత్తాత్రేయ, ఆ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిమ్లాలో జరుగుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/