పదవి కాంక్ష లేదన్న జగ్గారెడ్డి

Jagga Reddy
Jagga Reddy

హైదరాబాద్‌: తనకు పదవి మీద ఎలాంటి వ్యామోహం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యె జగ్గారెడ్డి తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన మందు తన దగ్గర ఉందని, టిపిసిసి అధ్యక్షుడి అవకాశమిస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పారు. ఎఐసిసి నేతలు సోనియా, రాహుల్‌ అడుగుజాడల్లో అందరూ నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌, సోనియా లేకుండా కాంగ్రెస్‌ పార్టీ లేదన్నారు. తన రాజాకీయ జీవితం ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ప్రారంభమైందని, కాగ్రెస్‌లో అన్ని మతాలవారికి, వర్గాలవారికి ప్రాధాన్యత ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/