ఏపిలో జగన్‌ సిఎంగా ప్రమాణం..తెలంగాణలో సంబరాలు

ysrcp leaders
ysrcp leaders

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణలోని వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు, జగన్‌ అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కేకులు కోసి, బాణసంచాలు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్‌ఆర్‌సిపి నేతలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు స్వీట్లు పంచకున్నారు. హైదరాబాద్‌లో జగన్‌ చదువుకున్న ప్రగతి మహావిద్యాలయలో ఆయన స్నేహితులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/