ఏడాది కొకసారి మహిళలను గౌరవిస్తే సరిపోదు

సైఫాబాద్‌, : ఏదాడి ఒకసారి నిర్వహించే అంతర్జాతీయ మహిళ దినోత్సవంనాడు కేవలం మహిళలను సత్కరించి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారి హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని ఫండ్‌మెంట్‌ రైట్స్‌ ప్రోటెక్ట్‌ అండ్‌ అవేర్‌నేస్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్ధాపకరాలు సులోచన జాకబ్‌ కోరారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల వెనుక మహిళలు ఉండి ఎన్నో సేవలు అందించారని, ఇక నుంచి మహిళల వెనుకు రాజకీయ నాయకులు ఉండి సేవలు అందించాలని ఆమె కోరారు.తెలంగాణ బిసి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినత్సోవం సందర్భంగాకు ఆమెకు జరిగిన సన్మాన సభలో ప్రసంగించారు. ఆడపిల్లలు జన్మిస్తే సమాజం చిన్న చూపు చూస్తున్నదని, తల్లిదండ్రులు సైతం ఇబ్భందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మగ పిల్లలతోపాటు ఆడి పిల్లలను కూడా సమానంగా తల్లిదండ్రులు పెంచాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు రంగాచారి, డా.సత్యనారాయణ, డి.రామాచారి, సురేష్‌, బండారి శివకుమార్‌, ఆవుల విజ§్‌ుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.