రీవెరిఫికేషన్‌ ఫలితాలు 27న విడుదల చేయాలి

High Court
High Court

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ఈరోజు ఇంటర్‌ ఫలితాల వివాదంపై విచారణ జరిగింది. ఈనెల 27న రీవెరిఫికేషన్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఫలితాలతోపాటు జవాబు పత్రాలను కూడా ఆన్‌లైన్లో పెట్టాలని కోర్టు పేర్కొంది. అయితే ఈరోజు రాత్రికే రీవెరీఫికేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందని ఇంటర్‌ బోర్టు హైకోర్టుకు తెలిపింది. సవరించిన మార్కులు మెమోలు రేపే ఇచ్చేందుకు సిద్దమని ఇంటర్‌ బోర్టు తెలిపింది. ఫలితాలు ప్రాసెస్‌ చేసిని గ్లోబరీనా సంస్థకు కోర్టు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను జూన్‌ 6కు హైకోర్టు వాయిదా వేసింది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/