హైకోర్టులో ఇంటర్‌ ఫలితాలపై విచారణ

High Court
High Court

హైదరాబాద్‌: ఈరోజు హైకోర్టులో ఇంటర్‌ ఫలితాల వివాదంపై విచారణ జరిగింది. పునపరిశీలన ఫలితాలు అన్నీ జవాబు పత్రాలతో సహా వెల్లడించామని హైకోర్టుకు ఇంటర్ బోర్డు తెలిపింది. పునపరిశీలన పూర్తి వివరాలతో హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అయితే ఇప్పటి వరకు పునపరిశీలన పూర్తి చేయలేదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. అఫిడవిట్ పరిశీలించి అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా తెలపాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.దీంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/