ఇంటర్‌ ప్రశ్న పత్రాలు మాయం

Inter exam
Inter exam

వరంగల్‌: తెలంగాణలో ఈనెల 7 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇంటర్‌ ప్రశ్న పత్రాలు గల్లంతయ్యాయి. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచిన 13 సీల్డు బాక్సుల్లో.. రెండు బాక్సులు మాయమయ్యాయి. ఈవ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండ్రోజులుగా పోలీసులు ప్రశ్నపత్రాలున్న బాక్సుల కోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కాగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీపరీక్షల కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 23,330 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/