జీడిమెట్లలో విషాదం ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని మనస్థాపంతో తనువు చాలించిన యువతి

inter-girl-lost-her-life-as-feeling-lonelyness
inter-girl-lost-her-life-as-feeling-lonelyness

హైదరాబాద్‌: ప్రేమించిన వాడూ పట్టించుకోవట్లేదంటూ..బస్తీలో పోకిరీలు వేధిస్తున్నారన్న సమస్య కలిసి..ఓ ఇంటర్‌ విద్యార్థిని ప్రాణాలు బలి చేసుకుంది. జీడిమెట్లలో జరిగిందీ ఈ ఘటన. స్థానిక సురారం డివిజన్‌..నెహ్రూ నగర్‌కి చెందిన 17 ఏళ్ల యువతి తల్లిదండ్రులైన లక్ష్మణ్‌, సుశీల చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మ కోమలిబాయి దగ్గరే ఉంటూ..చింతల్‌లోని భాగ్యరథి కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఈ క్రమంలో నెహ్రూనగర్‌కి చెంది ఓ యువకుడు పరిచమయ్యాడు. ఆ మాటాలు ఆమెను కదిలించాయి. కొన్నాళ్లు ప్రేమగా ఉన్నా ఆ యువకుడు ప్రస్తుతం ఇంటర్‌ ఎగ్జామ్స్‌ వస్తున్నాయి కదా..అందువల్ల బాగా చదువుకోమని చెప్పి ..అతను కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతని ప్రేమలో నిండా మునిగిన యువతికి అతను మాట్లాడని ప్రతీక్షణం ఓ నరకంలా అనిపించసాగింది. తనలో తనే కుమిలిపోతూ.. ఈ ప్రపంచానికి తాను అవసరం లేదనుకుంటూ..తన మరణమే అన్ని సమస్యలకూ పరిష్కారం అనుకున్న అమ్మాయి..ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని విచారణ చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/