ఆర్టీసి ప్రైవేటీకరణపై విచారణ వాయిదా

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: ఆర్టీసి ప్రైవేటీకరణ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు, దానిని సోమవారానికి వాయిదా వేసింది. 5300 రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలను నిలిపివేయాలని ప్రొ.విశ్వేశ్వరరావు పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా హైకోర్టు కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ కోర్టుకు సమర్పించాలని ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటీకరణపై తదుపరి విచారణ ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసి కార్పొరేషన్‌ కూడా కౌంటర్‌ దాఖలు చేయాలని తెలిపింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/