తొమ్మిది గంటలు ఆలస్యంగా వచ్చిన ఇండిగో

సమాచారం లేకపోవడంతో తప్పని ఎదురుచూపు

IndiGo
IndiGo

శంషాబాద్‌: హైదరాబాద్‌ రావాల్సిన ఓ ఇండిగో విమానం తొమ్మిది గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. వివరాల్లోకి వెళితే…లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు నిన్న రాత్రి ఈ విమానం రావాల్సి ఉంది. విమానం ఆలస్యమని ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఎప్పటిలాగే శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు .రాత్రంతా వేచి చూసినా విమానం రాలేదు. విమాన సిబ్బంది సరైన సమాచారం ఇవ్వక పోవడం, వేచి ఉండేందుకు మార్గం లేకపోవడంతో ఏరో బ్రిడ్జిపైనే రాత్రంతా ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు 9 గంటలు ఆలస్యమైనా సరైన సమాచారం లేకపోవడంతో విమాన నిర్వాహకులు తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/