ప్రైవేట్ ల్యాబ్ ప్రతినిధులతో మంత్రి ఈటల భేటి

కరోనా టెస్ట్‌ల సంఖ్య పెంచాలి: మంత్రి ఈటల

eetela rajendar
eetela rajendar

హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని… ఈ నేపథ్యంలో పాజిటివ్ గా తేలిన ప్రతి వ్యక్తి వివరాలను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటికే వచ్చి పరీక్షలను నిర్వహిస్తామంటూ మార్కెటింగ్ చేయవద్దని చెప్పారు. కరోనా పరీక్షలకు, సాధారణ పరీక్షలకు చాలా తేడా ఉందని మంత్రి చెప్పారు. కరోనా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్యశాఖకు అందించాలని తెలిపారు. శాంపిల్స్ తీసుకున్న వారి రిజల్ట్స్ వచ్చేంత వరకు వారిని ఐసొలేషన్ లోనే ఉంచాలని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్స్ ఇవ్వాలని చెప్పారు. లేకపోతే వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుందని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/