విఆర్వో పరీక్ష రాస్తుండగా కూలిన భవన0 పెచ్చులు

IMG
IMG

విఆర్వో పరీక్ష రాస్తుండగా కూలిన భవన0 పెచ్చులు

మెట్‌పల్లి, (జగిత్యాల జిల్లా): టిఎస్‌పిఎస్‌సి నిర్వహిస్తున్న వీఆర్వో పోస్టుల వ్రాత పరీక్షల్లో ఆపశృతి చోటు చేసుకుంది. వివరాళ్ళోకి వెళితే…జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విఆర్వో పరీక్ష వ్రాస్తుండగా మల్యాల మండల కేంద్రానికి చెందిన మండలోజి రజితపై భవన పై పెచ్చులు ఊడిపడ్డాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తహసీల్దార్‌ సుగుణకర్‌రెడ్డి తెలిపారు. ఆమె భుజానికి, కాలికి స్వల్పంగా గాయాలైనట్లు పేర్కొన్నారు.