లక్షణాలు కనిపిస్తే తెలియచేయండి.. కెసిఆర్‌

లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలు అవుతుంది.

kcr
kcr

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విదించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌ డౌన్‌ తెలంగాణలో విజయవంతంగా అమలు అవుతున్నదని సిఎం కెసిఆర్‌ అన్నారు. నిన్న రాత్రి పది గంటలవరకు తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు అందరూ అధికారులు, పోలీస్‌ వ్యవస్థకు అభినందనలు తెలుపుతున్నానని, రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. కరోనా లక్షణాలు ఎవరికయిన కనిపిస్తే వెంటనే తెలియచేయాలని ప్రజలను కోరారు. అందరు రెండు వారాల పాటు ఇంట్లోనుండి బయటకు రాకుండా ఉండాలన్నారు. అలా చేస్తే రాష్ట్రం నుండి కరోనాను తరిమేసినట్టేనని, ఇందుకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/