కరీంనగర్‌లోని కాలువలో రెండు మృతదేహాలు

Two dead bodies found in canal
Two dead bodies found in canal

కరీంనగర్‌: జిల్లాలో ఓ కారు కలకలం రేపింది. 15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్‌ లో పడిపోయిన ఓ కారు, ఈ ఉదయం బయటపడగా, అందులో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు. చెల్లులు, బావ మరణంతో కుంగిపోయిన మనోహర్ రెడ్డిని పలువురు రాజకీయ, పుర ప్రముఖులు ఓదార్చారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/