ప్రియాంకారెడ్డి కేసుపై స్పందించిన కెటిఆర్‌

ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానను

ktr
ktr

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులో ప్రియాంకారెడ్డిని కొందరు అత్యాచారం చేసి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ..పశు వైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్యాచార ఘటన కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన అన్నారు. ఈ దారుణ ఘటన కేసులో నిందితులను పోలీసులు పట్టుకుంటారన్న విశ్వాసముందని తెలిపారు. బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరుగుతుందని కెటిఆర్‌ భరోసా ఇచ్చారు. ప్రియాంకారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే డయల్ వెంటనే 100 నంబరుకి ఫోన్ చేసి సాయం కోరవచ్చని ఆయన చెప్పారు.
తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/