ఈ నెలాఖరులోగా దుర్గం చెరువు వంతెన సిద్ధం

Durgam Cheruvu cable bridge
Durgam Cheruvu cable bridge

హైదరాబాద్‌: నగరంలోని దుర్గంచెరువు ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి ఫిబ్రవరి నెల చివరి నాటికి పూర్తి కానుంది. ఇప్పటికే ఈ వంతెనకు సంబంధించి రైలింగ్‌, రహదారి నిర్మాణం, లైటింగ్‌ పనులు చేపట్టారు. కాగా ఈ వంతెన పూర్తయితే జూబ్లీహిల్స్‌ నుంచి మాదాపూర్‌ వరకు రాకపోకలు వేగంగా జరుగుతాయి. ఈ నెలాఖరులోగా వంతెనను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోస్తామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు వంతెనకు దారితీసే మరొక ఫ్లైఓవర్‌ కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకోని ప్రభుత్వం ఇటీవలే పనులను వేగవంతం చేసింది. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో 26 కేబుల్స్‌ సహాయంతో మొత్తం 53 సిసి(సిమెంట్‌ – కాంక్రీట్‌) విభాగాలు అమర్చడం జరిగింది. అంతే కాకుండా ప్రారంభించి 22 నెలల్లోనే పూర్తి కావడం ద్వారా కూడా రికార్డు సృష్టించింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వంతెన త్వరలోనే పూర్తయి అందుబాటులోకి రానుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/