ప్రమాదాలు నివారించేందుకే భారీగా ట్రాఫిక్‌ ఛలాన్లు

Hyderabad Traffic Police
Hyderabad Traffic Police

Hyderabad: ప్రమాదాలు నివారించేందుకే భారీగా ట్రాఫిక్‌ ఛలాన్లు పెంచడం జరిగిందని, రేపటి నుంచి దేశ వ్యాప్తంగా అమలు అవుతాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మాత్రం కోర్టుకు వెళ్లే చలానాలు మాత్రమే రేపటి నుంచి అమలు అవుతాయన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్ల డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేసుల్లో కోర్టుకు హాజరయ్యే కేసులకే పెంచిన చలాన్ల అమలు అవుతాయన్నారు. ఆన్‌లైన్‌, ఈసేవల్లో కట్టే చలాన్లు మాత్రం ప్రభుత్వం అనుమతితో పెంచుతామని, కాబట్టి ఇంతకు ముందున్న చలాన్లు మాత్రమే వాహనదారులకు విధిస్తామన్నారు.