హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్‌ ఫ్లూ

Swine flu cases in hyderabad
Swine flu cases in hyderabad

హైదరాబాద్‌: ఒకవైపు ప్రపంచదేశాలను కోవిడ్‌-19 వైరస్‌ వణికిస్తుంది.. మరోవైపు హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా కొన్ని కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది.. కానీ సీజన్‌ కాని సీజన్‌లో స్వైన్‌ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో మళ్లీ స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 15 స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. ఫిబ్రవరి నెలలోనే 8 కేసులు నమోదయ్యాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో కోవిడ్‌-19 వైరస్‌ అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే స్వైన్‌ఫ్లూ బయటపడుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/