జూన్ మూడో వారం నుంచి హైదరాబాద్ మెట్రో!

లాక్‌డౌన్ కారణంగా ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు

Metro rail
Metro rail

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జూన్‌ మూడో వారం నుంచి పున: ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. పలు రవాణా వ్యవస్థలకు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో త్వరలోనే వీటి రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఎల్బీనగర్‌మియాపూర్, జేబీఎస్‌ఎంజీబీఎస్, నాగోల్‌రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉండగా.. మూడు బోగీలు గల మెట్రో రైలులో దాదాపు వెయ్యి మంది దాకా ప్రయాణం చేయవచ్చు. అయితే, కరోనా నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున 5060 శాతం ప్రయాణికులతోనే నడవనున్నాయి. ఒక్కో రైలులో 500 నుంచి 600మందిని మాత్రమే అనుమతించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/