హైదరాబాదులో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

రేపటి నుంచి పూర్తి స్థాయిలో తిరగనున్న బస్సులు

city-buses

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాదులోని సిటీ బస్సులు డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే దాదాపు 185 రోజుల తర్వాత నిన్న పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. అయితే నగర శివార్లలోని డిపోల నుంచి 229 బస్సులను అధికారులు తిప్పారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 3,200 బస్సులు ఉన్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కనున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా మార్చి 19న సిటీ, జిల్లా బస్సులు ఆగిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వీటిలో శివార్లలో ఉన్న డిపోల నుంచి 15 కిలోమీటర్ల రేంజ్ లో నిన్న బస్సులు తిరిగాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో… బస్సులు నడిపినా ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/