కేన్సర్‌ మందుల పై భారీ తగ్గింపు

cancer drugs
cancer drugs

హైదరాబాద్‌: జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థకేన్సర్‌ రోగులు వాడే మందుల ధరలనుభారీగా తగ్గించింది. ఈ మేరకు సోమవారం ధరల్ని ప్రకటించింది. ముఖ్యంగా కీమోథెరపీ చికిత్సకు సంబంధించిన 9రకాల మందుల ధరలు బాగా తగ్గాయి. ఊపిరితిత్తుల కేన్సర్‌ కోసం వాడే పెమెక్స్‌ (500ఎంజీ) ధర ప్రస్తుతం రూ. 22వేలు ఉండగా రూ.2800కు తగ్గింది. ఇదే డ్రగ్‌ 100ఎంజీ ధర రూ.7700 ఉండగా అది రూ.800కు తగ్గింది. ఎర్లోటినిబ్‌ 100ఎంజీ ట్యాబ్లెట్స్‌ ధర రూ.6600 నుంచి రూ.1840కి తగ్గించారు. ఎపిక్లోర్‌ 10ఎంజీ ఇంజక్షన్‌ ధర రూ.561నుంచి రూ.276కు, 50ఎంజీ ధర రూ.2662 నుంచి రూ.960కి తగ్గింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/