ఆసుపత్రిలో చేరానని వస్తున్న వార్తలపై స్పందించిన హిమాన్షు

నేను నడవగలుగుతున్నాను ..టిఆర్‌ కుమారుడు హిమాన్షు

himanshu rao

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ మనవడు, కెటిఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి గాయమైందని ఈ ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ గత రాత్రి హిమాన్షు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరిగింది. ఆయన కనీసం నిలబడలేక పోతున్నాడని ప్రచారం అయింది. దీనిపై హిమాన్షు స్పందిస్తూ తనపై వస్తోన్న వార్తలను ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశాడు.

‘ప్లీజ్‌.. ఇటువంటి వార్తలు రాస్తోన్న సిల్లీ న్యూస్‌ పేపర్లను నమ్మకండి’ అంటూ పేర్కొన్నాడు. ‘కొన్ని న్యూస్ పేపర్లు నా గురించి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నాయి. నాకు ఫ్రాక్చర్ అయిందని అంటున్నాయి. నేను పూర్తిగా బాగున్నాను. నా కాలు స్వల్పంగా బెణికింది. నేను నడవగలుగుతున్నాను. నేను రేపటి నుంచి రన్నింగ్ చేయడం ప్రారంభిస్తాను. నా గురించి తప్పుడు వార్తలు రాసే సాహసం చేయకండి.. థ్యాంక్యూ’ అని హిమాన్షు చెప్పాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/