కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి నిరాకరణ

congress party
congress flags

హైదరాబాద్‌ : గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు.. శుక్రవారం కాంగ్రెస్‌ చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీ నిర్వహించి తీరతామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. గాంధీభవన్‌ కి కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరేందుకు సన్నద్ధమయ్యారు. గవర్నర్‌ను కలిసి కాంగ్రెస్‌ పార్టీ వినతిపత్రం ఇవ్వనుంది. కేంద్ర ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్‌ నుండి వారు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు వలయాన్ని నెట్టుకొని ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణుల ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువరు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/