నగరంలో భారీగా ట్రాఫీక్‌ జామ్‌

Heavy Traffic In Hyderabad
Heavy Traffic In Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఈరోజు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో పాటు అమీర్ పేట నుంచి గౌలిగూడ వరకు గురునానక్ రథయాత్ర నిర్వహిస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వాహనాలను ఎస్ఆర్ నగర్ నుంచి పంజాగుట్ట మీదకు దారి మళ్లించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/