హైదరాబాద్‌లో భారీ వర్షం

Heavy-rain-hyderabad

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వర్షపు నీరు భారీగా రోడ్ల మీదికి చేరుతుంది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీరు వెళ్లేందుకు మాన్యువల్స్ వద్ద మరమ్మతులను నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లి, సికింద్రాబాద్ వారసిగూడ, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. భారీ వర్షానికి అంబర్‌పేట్‌ ముసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అసిఫ్ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, గోశామహల్, మసబ్ ట్యాంక్, లకిడకపూల్, బేగంపేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్ బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, గాజులరామరం, చందనగర్‌లలో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వర్షపు నీళ్లు రోడ్లపై నిలిచాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/