నగరంలో భారీ గంజాయి స్వాధీనం

Ganjai
Ganjai

హైదరాబాద్‌: నగరంలో డీఆర్‌ఐ అధికారులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి దాదాపు 962 కేజీల గంజాయి ఉంటుందని, దాని విలువ రూ.కోటి 90 లక్షలని అధికారులు అంచనా వేశారు. కొబ్బరి మొక్కల చాటున రాజమండ్రి నుంచి జహీరాబాద్‌కు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, డీసీఎం వ్యాన్‌‌ను సీజ్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/