శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలి

HARISH RAO
HARISH RAO

సిద్ధిపేట: ఎమ్మెల్యె హరీశ్‌రావు మహాశివరాత్రి సందర్భంగా సిద్ధిపేట ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయంలో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. పరమేశ్వరుని దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. స్వామి ఆశీస్సులతో రెండోసారి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని హరీశ్‌ చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని..బంగారు తెలంగాణ సాకారం కావాలని స్వామినవేడుకున్నట్లు హరీశ్‌ తెలిపారు.