సాయిబాబా ఆలయంలో హరీష్ పూజలు

harish-rao
harish-rao

సిద్దిపేట : గురు పౌర్ణమిని పురస్కరించుకుని సిద్దిపేట షిర్డీ సాయిబాబా దేవాలయంలో ఎంఎల్ఎ హరీష్ రావు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సాయిబాబాకు మొక్కులు చెల్లించుకున్నారు. సద్గురవుల ఆశీస్సులతో సత్ సంకల్పం సిద్ధిస్తుందని ఆయన పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సద్గురు సాయిబాబాను పూజిస్తామని ఆయన చెప్పారు. గురుపౌర్ణమి నాడు గురువుల ఆశీస్సులు తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి సత్ సంకల్పం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు. సాయిబాబా కరుణాకటాక్షంతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం ద్వార ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండడమే కాదని, సమాజ శాంతి కూడా వర్థిల్లుతుందని ఆయన పేర్కొన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/