సియం పట్టుదలతోనే కాళేశ్వరం సాధ్యమైంది

harish rao
harish rao, siddhipet mla


సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో రెండు పంటలను చూస్తామని మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టుల పేర్లు మరచిపోయామని, ఆ పార్టీ అధికారంలో ఉంటే 30 ఏళ్లు గడిచినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు సంబురాల్లో హరీశ్‌ కేక్‌ కట్‌ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..సియం కేసిఆర్‌ శ్రమతో మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని చెప్పారు. సియం పట్టుదలతో ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులందరికీ హరీశ్‌రావు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో దసరా పండగ ఎంత ముఖ్యమో..కాళేశ్వరం ప్రారంభోత్సవం కూడా అంతే ముఖ్యమన్నారు. ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు పనుల్లో తన వంతు సాయం చేసినందుకు సంతోషంగా ఉందని హరీశ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/