ఉగాది పండగకు .. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

ఎండాకాలం వస్తే కరెంట్‌ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు

harish rao
harish rao

సిద్ధిపేట: ఉగాదికి పైసా ఖర్చు లేకుండా పేదవారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని, స్థలం ఉన్న వారికి తొందరలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు తెలిపారు. దుబ్బాక పట్టణ, ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహిళా భవన నిర్మాణానికి హరీష్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎండాకాలం వస్తే కరెంట్‌ బాధ ఉండే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ వృద్ధులకు రెండువేల పింఛన్‌ ఇచ్చి కొండంత అండగా నిలిచారని అన్నారు. మహిళలకు రూ.50 లక్షల రూపాయలతో మహిళా భవనం శంకుస్థాపాన చేశామని తెలిపారు. త్వరలోనే వెజ్‌,నాన్‌ వెజ్‌ మార్కెట్‌ కట్టిస్తామని అందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచలోనే అతి పెద్ద సమస్య అయిన చెత్తపై అందరు కలిసికట్టుగా పనిచేసి చెత్తను లేకుండా చేసి, స్వచ్ఛ దుబ్బాకగా తీర్చిదిద్దుతామని భరోసానిచ్చారు. పారిశుధ్య కార్మికులకు పనితగ్గాలంటే మనమంతా తడి, పొడి చెత్తను వేరు ఇవ్వాలని హరీష్‌ రావు సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/