మహాకూటమిని మట్టిలో కలిపేస్తాo

Harish Rao
Harish Rao

Sidhipet: మహాకూటమిని మట్టిలో కలిపేస్తామని  మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ములుగు మండలంలో ఉద్యాన విశ్వ విద్యాలయం, అటవీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ములుగు మండలంలో కొండపోచమ్మ జలాశయం, విత్తన పార్క్ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ కే ఉందన్నారు. రాష్ట్రంలో వందకు పైగా సీట్లను గెలుపొంది అధికారం చేపడతామన్నారు.