శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తాసుఖేందర్

Gutta unanimously elected Legislative Council Chairman
Gutta unanimously elected Legislative Council Chairman

హైదరాబాద్ : శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తాసుఖేందర్ రెడ్డి విపక్షాల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి గుత్తసుకేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యలు ప్రకటించడంతో డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ రావు సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్ సీటు పై కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తపించిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాల్లో అజాత శత్రవుని ప్రశంసించారు. గ్రామస్థాయిలోని వార్డుమెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడుగా, శాసనమండలి ఛైర్మన్‌గా ఎలాంటి వివాదాలకు అవకాశాలు ఇవ్వకుండా ఎదిగిన నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ ఆయన గుర్తు చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/