సమ్మక్క-సారలమ్మ సేవలో గవర్నర్లు

Dattatreya, Tamilasye

Medaram: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మేడారం సమ్మక్క-సారలమ్మ సేవలో పాల్గొన్నారు. మేడారం జాతరకు చేరుకున్న గవర్నర్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు. ములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. వనదేవతలకు గవర్నర్లు, మంత్రులు పూజలు చేసి ముడుపులు సమర్పించుకున్నారు. గవర్నర్లు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/