బాలు మ‌ర‌ణం దేశానికి, క‌ళారంగానికి తీర‌ని లోటు

governor-tamilisai-pay-tribute-to-sp-balasubrahmanyam

హైదరాబాద్‌: గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి తీవ్ర దిగ్ర్భాంతి క‌లిగించింద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర షాక్‌కు గురైనట్టు తెలిపారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఎంతో ప్రతిభను కనబర్చారని పేర్కొన్నారు. లక్షలాది మంది సంగీత ప్రియులను ఎస్పీబాలు గానంతో అలరించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారని తెలిపారు. దశాబ్ధాలుగా సంగీత ప్రపంచానికి ఆయన సేవలు అందించారని అన్నారు. దాదాపు 40వేల పాటలను వివిధ భాషల్లోపాడి ప్రజల్ని అలరించారని తెలిపారు. ప్రజల గుండెల్లో బాలు, ఆయన పాటు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి జాతికి ముఖ్యంగా సంగీత ప్రపంచానికి తీరని లోటని గవర్నర్‌పేర్కొన్నారు. ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై బాలు కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/