వీసీలతో గవర్నర్‌ తమిళిసై భేటి

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వీసీలతో సమావేశం అయ్యారు. యూనివర్సిటీల ఇన్‌చార్జ్ వీసీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. యూనివర్సిటీల పరిస్థితిపై గవర్నర్‌ తమిళిసై సమీక్ష చేపట్టారు. యూనివర్సిటీల్లో కోర్సులు, అమలవుతున్న కార్యక్రమాలపై అడిగితెలుసుకున్నారు. బయోమెట్రిక్, అకడమిక్ క్యాలెండర్ తదితర అంశాలపై కూడా చర్చించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/