జైట్లీ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అరుణ్‌జైట్లీ మృతి పట్ల గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం తెలిపారు. అరుణ్‌జైట్లీ కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని నరసింహన్‌ చెప్పారు.

అరుణ్‌జైట్లీ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ మరణం బిజెపి కి తీరని లోటని, జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. జైట్లీ కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/