ఆర్టీసి చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

hikes-bus-charges
hikes-bus-charges

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మె విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీసి బలోపేతం చేస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. సుమారు నాలుగున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం తాజాగా ఆర్టీసి ఛార్జీల పెంపుదలకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రతి కిలోమీటరుకు 20 పైసల చొప్పున చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసి నష్టాల్లో ఉండటానికి డీజిల్‌ ధరలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతార్జాతీయ మార్కెట్టులో చమురు ధరల ఆధారంగా డీజిల్‌, పెట్రోలు ధరలను కేంద్రం పెంచుతూ వస్తోంది. ఆ ప్రభావం కూడా ఆర్టీసిపై గణనీయ ప్రభావాన్ని చూపుతోంది. అందుకే తొలిసారి అన్ని సర్వీసుల్లో ఒకే మొత్తంలో 20 పైసలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుదలతో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ. 752 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసి అధికారులు తెలిపారు. ఛార్జీల పెంపుదలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఏయే మార్గంలో ఎంత ఛార్జీ పెరుగుతుందన్నదీ ఒకటీ రెండు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/