ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ప్రభుత్వం

Telangana for 'Best Teacher Award
Telangana for ‘Best Teacher Award

హైదరాబాద్: టీచర్స్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించింది. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయలుగా ఎంపికైన వారిని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శాలువాలతో సత్కరించి , పది వేల చొప్పున బహుమతి, బంగారు పూత పూసిన వెండి పతకం, ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను గౌరవించాలని జగదీశ్ రెడ్డి తెలిపారు. గురువులను గౌరవించడంలో సిఎం కెసిఆర్ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతృప్తి, గౌరవం మరే వృత్తిలో ఉండదని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యా శాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, నిరుపేద వర్గాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలను స్థాపించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/