హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైంది

తెలంగాణ సర్కార్ ఏర్పడి 8 నెలలైనా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు

Rakesh Reddy
Rakesh Reddy

హైదరాబాద్‌: బిజెపి అధికార ప్రతినిధి రాకేష్‌ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాగా ఎన్నికల హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుబందు ఇంకా 40శాతం మందికి రైతులకు అందలేదని.. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వట్లేదన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారని.. ఇందుకు పరిష్కార మార్గం చూపాలని సర్కార్‌ను రాకేష్ రెడ్డి కోరారు. వర్షం పడితే పేదలు ఇండ్లలో ఉండే పరిస్థితి లేదని.. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పెంచలేదని ఎద్దేవా చేశారు.


తాజా నాడీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/