మైలారాం రిజర్వాయర్‌లో చేప పిల్లల పంపిణీ

talasani srinivas yadav
talasani srinivas yadav

వరంగల్‌: మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతోనే కుల వృత్తులు కుంటు పడి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. ఈ రోజు మైలారాం రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్‌ ప్రభుత్వం మత్స్య కార్మికులకు ఉచితంగా కోట్ల రూపాయలు వెచ్చించి చేప పిల్లలను అందిస్తుందన్నారు. మత్స్య కార్మికుల కోసం 900 కోట్ల రూపాయలు కేటాయించి సబ్సిడీ పై వాహనాలు, అనేక రకాల వస్తువులు అందించామన్నారు. రానున్నరోజుల్లో కెసిఆర్,కెటీఆర్ నేతృత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలోజిల్లా కలెక్టర్ హరిత, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/