మెదక్‌లో గోపాలమిత్రులకు శిక్షణ శిబిరం

talasani srinivas yadav
talasani srinivas yadav


మెదక్‌: గోపాలమిత్రుల రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం మెదక్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనావాస యాదవ్‌ మాట్లాడుతూ..మూగజీవాలకు సేవ చేస్తున్న గోపాలమిత్రులు అదృష్టవంతులని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన అన్నారు. శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని గోపాల మిత్రులు నైపుణ్యం పెంపొందించుకోవాలి. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ. 8500లకు పెంచిందని అన్నారు. పాడిపంటలతో కళకళలాడాలని సియం కేసిఆర్‌ ఆశయం అని మంత్రి తలసాని ఉద్ఘాటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/