యాదాద్రి భక్తులకు శుభవార్త!

త్వరలో ఇంటికే రానున్న స్వామి వారి లడ్డూ ప్రసాదాలు

Lakshmi Narasimha Temple, Yadadri
Lakshmi Narasimha Temple, Yadadri

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ గుడ్ న్యూస్‌ను అందించింది. త్వరలోనే స్వామిఅమ్మవార్ల ప్రసాదంతో పాటు అక్షితలు, కుంకుమను నేరుగా భక్తుల ఇంటికి చేర్చేలా నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్ పోస్టులో తపాలాశాఖ ఈ సేవలను భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు పోస్టల్(తపాలా) శాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్క యాదాద్రిలోనే కాకుండా బాసర, భద్రాచలం, వేములవాడ సహా మరో 10 ఆలయాల నుంచి భక్తుల కోరుకున్న విధంగా ప్రసాదం, అక్షితలు, కుంకుమను స్పీడ్ పోస్టులో ఇంటికి పంపేలా తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ఈ సేవలను పొందేందుకు చెల్లింపులను నెట్ బ్యాంకింగ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ పద్ధతుల్లో స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చెల్లింపులను పోస్టల్ శాఖ బరువు ఆధారంగా నిర్ణయించనుంది. ఈ సేవలు ఫిబ్రవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/