జిహెచ్‌ఎంసి నుంచి దాన కిషోర్ బదిలీ

Dana Kishore
Dana Kishore

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి కమిషనర్ దానకిషోర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి కమిషనర్‌తో పాటు జలమండలి ఎండిగా కూడా దానకిషోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పై ఆయన జలమండలి ఎండిగా మాత్రమే కొనసాగనున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అదే జిల్లాకు చెందిన జెసి హరీశ్‌ను నియమించారు.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/