ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన గద్దర్‌

gaddar
gaddar

హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌ తెలంగాణ సాంస్కృతిక సారిథిలో కళాకారుడి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నిర్ణీత నమునాలో కాకుండా సొంత లెటర్‌ప్యాడ్‌పై ఉద్యోగం కోసం దరఖాస్తు అందించారు. నిన్న గద్దర్‌ స్వయంగా మాదాపూర్‌లోని తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయానికి వెళ్లారు. తన వయసు 73 ఏళ్లని, తానొక గాయకడినని, గాయపడ్డ ప్రజల పాటలను రాయడం, పాడటం తన వృత్తి అని దరఖాస్తులో పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యను చదివిన తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లు లేవని అందులో తెలిపారు. ఒక కళాకారునిగా తనను నియమించుకొవాలని ఆయన కోరారు. కాగా సాంస్కృతిక సారథి నియామక కమిటీ కార్యదర్శి బి. శివకుమార్‌ ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/