100 కిలోల గంజాయి స్వాధీనం

Gamjayi
Gamjayi

Khamam: ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాంధీనగర్ వద్ద పోలీసులు 100 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొలేరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాద సమయంలో వాహనంలో 100కిలోల గంజాయి ఉంది. వాహనదారుడు గంజాయిని కొబ్బరి బొండాల మధ్య పెట్టి తరలిస్తున్నాడు. కాగా ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.