మంచినీటి వెతలు తీర్చండి


విద్యానగర్‌, : వేసవిలో మంచినీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బిజెవైఎం గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి మద్దూరి శివాజి కోరారు. ఈ మేరకు మంగళవారం శివాజి ఒక ప్రకటన చేస్తు ఇటివలి కాలంలో ముషీరాబాద్‌ నియోజవకర్గంలోని పలు చోట్ల మంచినీటి ఇక్కట్లు తలెత్తెన్నాయన్నారు. అదనంగా మరో రిజర్వాయర్‌ అందుబాటులోకి వచ్చినప్పటికి అనేక ప్రాంతాలను లోప్రెషర్‌ సమస్యలు వేదిస్తున్నాయని,మరికొన్ని చోట్ల కలుషితనీరు వస్తుందన్నారు. వేసవిలో నీటి ఇక్కట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అందరికి మంచినీరు సక్రమంగా అందేలా ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని శివాజి ఆ ప్రకటనలో జలమండలి అధికారులకు విజ్ఞప్తి చేశారు.