జూనియర్‌ న్యాయవాదులకు చట్టాలపై ఉచిత శిక్షణ

junior advocates
junior advocates


హైదరాబాద్‌: నవ తెలంగాణ అడ్వకేట్‌ ఫోరం ఆధ్వర్యంలో జూనియర్‌ న్యాయవాదులకు ఈనెల 12 వ తేదీన రాజ్యాంగం, చట్టాలపై ఉచిత అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ శిక్షణా తరగతులు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగుతాయని ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగేందర్‌ తెలిపారు. సీనియర్‌ న్యాయవాదులు ఈ శిక్షణలో జూనియర్‌ న్యాయవాదులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని జూనియర్స్‌ సద్వినియోగం చేసుకోవాలని నాగేందర్‌ సూచించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/