కరోనా అనుమానితులు: గాంధీలో చేరిన నలుగురు

Gandhi Hospital
Gandhi Hospital

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ చైనాను దాటి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉంది. భారత్‌లో కూడా ఈ వైరస్‌ తొలుత కేరళ నమోదైన విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా వైరస్‌ లక్షణాలతో బుధవారం గాంధీ ఆసుపత్రిలో నలుగురు చేరారు. కాగా మంగళవారం కూడా కరోనా లక్షణాలతో నలుగురు చేరిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం చేరిన నలుగురిలో ఇద్దరికి
స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు గా వైద్యులు నిర్ధారించారు. దీంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరిని డిశ్చార్జ్‌ చేశారు. బుధవారం చేరిన నలుగురు అనుమానితుల కరోనా, స్వైన్‌ఫ్లూ పరీక్షలు జరుపుతున్నారు. వీరి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు గాంధీలోని వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/