ప్రారంభమైన చేపపిల్లల పంపిణీ

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

కాళేశ్వరం: తెలంగాణలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని కోయిల్‌ సాగర్‌లో చేపపిల్లలను వదిలిపెట్టి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణ ప్రాజెక్టులో మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 15 రోజుల్లోగా చేపపిల్లల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
ఇటీవల కురిసిన జోరు వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నీటి వనరుల్లో చేపపిల్లల విడుదలకు ఇదే మంచి సమయమని ప్రభుత్వం భావించింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. ఈ ఏడాది 24,953 నీటివనరుల్లో రూ.52కోట్ల విలువైన చేపపిల్లలను వదలాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 80.86 కోట్ల చేపపిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను నీటి వనరుల్లో వేయాలని నిర్ణయించింది. అని ఆయన తెలిపారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/