తొలి దశ పోలింగ్‌ ప్రారంభం

polling
polling

హైదరాబాద్‌: తొలి దశపోలింగ్‌ ప్రారంభమైంది. ఏపి, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా మొదలైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ మొదలైంది.ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రానికే చేరుకున్నారు. ఉదయం 5.30 గంటలకే మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. ఇటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. నిజామాబాద్‌తోపాటు సమస్యాత్మక ప్రాంతాలు మినహా మిగిలిన సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2,97,08,600 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/